బిజినెస్

వడ్డీలేని రుణాల లక్ష్యం నెరవేరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 25: ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు పంపిణీ చేయాల్సిన 11 వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాన్ని మార్చి నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పంపిణీ చేసి తీరాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం ఇక్కడ మధ్యాహ్నం తన నివాసంలో మహిళా స్వయంసహాయక సంఘాల పనితీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సెర్ప్ సీఈఓ పి కృష్ణమోహన్ పాల్గొన్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అనేక అంశాలను నిశితంగా పరిశీలించి తగు సూచనలిచ్చారు. దీనిని కేవలం రుణాల పంపిణీ ప్రక్రియగా భావించి తూతూమంత్రంగా పూర్తి చేసి వదిలేయకుండా డ్వాక్రా సంఘాలను పరిపుష్టం చేయడానికి వెచ్చించాలని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన స్ర్తి నిధి పథకాన్ని రానున్న కాలంలో పూర్తిస్థాయి బ్యాంక్‌గా మార్చాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్ర్తి నిధి కింద 1,100 కోట్ల రూపాయలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికి 682 కోట్ల రూపాయలు అందించామని, వచ్చే నెలాఖరులోగా లక్ష్యానికి చేరుకుంటామని సెర్ప్ సీఈవో వివరించారు. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి స్ర్తి నిధి పథకాన్ని బహుళ ప్రయోజనాలు అందించే కార్యక్రమంగా మలచాలని ముఖ్యమంత్రి చెప్పారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసి, ఆ స్ఫూర్తిని పూర్తిగా నీరుగార్చారని, సృజనాత్మకతను చిదిమేసి మహిళా శక్తిని హరించివేశారని మండిపడ్డారు. డ్వాక్రా సంఘాలను గత పాలకులు దుర్భర పరిస్థితిలో అప్పగించారని, మహిళా సాధికారతే ధ్యేయంగా మళ్లీ శూన్యం నుంచి ప్రారంభించి ఈ సంఘాలన్నింటికీ జవసత్వాలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఇక నుంచి డ్వాక్రా సంఘాలకు అందించే రుణాలు వారికి మరింత ఆదాయాన్ని సమకూర్చి ఆర్థికంగా సమున్నతుల్ని చేసే విధంగా ఉండాలని నిర్దేశించారు. రుణాలు అందజేసి తమ లక్ష్యాలను చేరుకున్నామని చెబితే సరిపోదని, ఆ రుణాలను సద్వినియోగం అయ్యేలా చూసే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. 70 లక్షల మంది డ్వాక్రా మహిళలకు నైపుణ్యాలు పెంచి ఆదాయ మార్గాలను కల్పిస్తే ఊహకు అందని అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రతి కుటుంబానికి కనీసం 10 వేల రూపాయల ఆదాయం సమకూర్చేలా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆ లక్ష్యానికి చేరువ కావడానికి డ్వాక్రా సంఘాలకు అందించే రుణాలే ఒక పని ముట్టు కావాలన్నారు. డ్వాక్రా సంఘాల సాయంతో వర్మీ కంపోస్టు తయారీని పెద్ద ఎత్తున చేపట్టాలని, ప్రతి ఇంటి నుంచి వ్యర్థాలను సేకరించి వాటిని వర్మీ కంపోస్టుగా మార్చి రైతులకు తిరిగి అందిస్తే అటు ఉత్పాదకత పెరుగుతుందని, ఇటు మహిళా స్వయం సంఘాలు ఆర్థికంగా మరింత బలపడతాయన్నారు. మహిళా సంఘాల ద్వారా గ్రామాల్లో బయోగ్యాస్ ఉత్పత్తి చేయగలిగితే ఇంధన కొరత కూడా తీరుతుందని అభిప్రాయపడ్డారు. ‘పసుపు-కుంకుమ’ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని 6,67,362 పట్టణ ప్రాంతాల్లోని 1,60,758 స్వయంసహాయక సంఘాల్లోని 82,13,281 మంది సభ్యులకు 4,971.94 కోట్ల రూపాయలు అందించామని ముఖ్యమంత్రి చెప్పారు. గత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో మరో లక్షా 85 వేల మంది మహిళలను ఈ పథకానికి అర్హులుగా గుర్తించామని, వారిని కూడా పసుపు-కుంకుమ పథకంలో చేరుస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద చేపట్టిన ఉన్నతి పథకానికిగాను 61,811 మంది సభ్యులకు 180 కోట్ల రూపాయలు అందించామన్నారు. కాగా, చంద్రన్న బీమా పథకానికి ఈ ఏడాది పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 తుది గడువుగా నిర్ణయించామని, అర్హులు నిర్ణీత వ్యవధిలోగా దరఖాస్తులు అధికారులకు అందించి పరిహారం పొందాలని ముఖ్యమంత్రి సూచించారు. చంద్రన్న బీమా పరిహారాలు మొత్తం ఆర్‌లైన్ ద్వారా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. పరిహారానికి దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఐదు రోజుల్లోగా సంబంధిత అనుమతి పత్రాలన్నీ జారీ చేసి తీరాలని, మరణ ధృవీకరణ పత్రం, పోస్టుమార్టం నివేదికలు అందించడంలో జాప్యం చేసే అధికారులను తొలగించడానికి కూడా వెనుకాడనని ముఖ్యమంత్రి విస్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ 48.68 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పింఛన్ల పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను ఒక నెలలోగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. ఇందుకు ఐటీ శాఖ సహాయం తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ప్రద్యుమ్న పాల్గొన్నారు.

చిత్రం..మహిళా స్వయంసహాయక సంఘాల పనితీరుపై సమీక్షిస్తున్న
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు