బిజినెస్

డీమానిటైజేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయింది: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 25: పాత పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ దాదాపు పూర్తయిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో తిరిగి కొత్త పెద్ద నోట్లను విజయవంతంగా తీసుకురాగలిగామని, ప్రపంచంలో మరెక్కడా కూడా ఇంత సజావుగా డీమానిటైజేషన్ జరగలేదని చెప్పారు. శనివారం ఇక్కడి ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లోని విద్యార్థులు, అధ్యాపకుల్లో ఒకరితో జైట్లీ పైవిధంగా చెప్పుకొచ్చారు. కాగా, ‘ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా: విజన్ ఫర్ ది నెక్స్ట్ డికేడ్’ అంశంపైనా మాట్లాడారు.
జిడిపి వృద్ధి అంచనా తగ్గించిన ఎన్‌సిఎఇఆర్
న్యూఢిల్లీ: మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను దేశ జిడిపి వృద్ధిరేటును తాజాగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ (ఎన్‌సిఎఇఆర్) కూడా తగ్గించింది. ఇప్పటికే ఆర్‌బిఐ, ఐఎమ్‌ఎఫ్ దేశ జిడిపి వృద్ధిరేటు అంచనాల్ని తగ్గించినది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్‌సిఎఇఆర్ 6.9 శాతానికి కుదించింది. ఇంతకుముందు ఇది 7.6 శాతంగా ఉంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంది.