బిజినెస్

ఎన్‌సిఎల్ షేర్ బైబ్యాక్ ప్లాన్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సిఎల్) షేర్ బైబ్యాక్ ప్లాన్‌కు దాని బోర్డు ఆమోదం తెలిపింది. 1,244 కోట్ల రూపాయల విలువైన షేర్లను తిరిగి ఎన్‌సిఎల్ కోనుగోలు చేయనుంది. ‘దామాషా విధానంపై టెండర్ ఆఫర్ ద్వారా సంస్థ సభ్యుల నుంచి ఒక్కోటి 1,000 రూపాయల ముఖ విలువ కలిగిన 76,356 ఈక్విటీ షేర్లను కొనేందుకు ఎన్‌సిఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అంగీకరించారు.’ అని కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) శనివారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలియజేసింది. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన కోల్ ఇండియాకు ఎన్‌సిఎల్ అనుబంధ సంస్థగా ఉంది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా వాటా 80 శాతానికిపైనే.