బిజినెస్

మళ్లీ రూ. 30 వేలకు బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: బంగారం ధరలు మళ్లీ 30 వేల రూపాయల స్థాయిని అధిగమించాయి. శనివారం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన పసిడి ధర 30,175 రూపాయలుగా నమోదైంది. శుక్రవారం ముగింపుతో పోల్చితే 325 రూపాయలు పెరగగా, నాలుగు నెలలకుపైగా గరిష్ఠ స్థాయిని అందుకుంది. నిరుడు అక్టోబర్ 18న బంగారం ధర 30,325 రూపాయలుగా ఉంది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లోకి ధర చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం, దేశీయంగా పెళ్లిళ్ళ సీజన్ కావడం వంటివి పుత్తడి ధరలను పరుగులు పెట్టిస్తున్నాయి. డాలర్ విలువ తగ్గడంతో మదుపరులు తమ పెట్టుబడులను బంగారంపైకి మళ్లిస్తున్నారని, ఈ పరిణామం కూడా అంతర్జాతీయ విపణిలో ధరల పెరుగుదలకు దోహదం చేస్తోందని బులియన్ ట్రేడర్లు విశే్లషిస్తున్నారు. కాగా, 99.5 స్వచ్ఛత కలిగిన పసిడి ధర 30,025 రూపాయలుగా నమోదైంది. ఇకపోతే వెండి ధర కూడా పెరిగింది. కిలో 600 రూపాయలు ఎగిసి 43,800 రూపాయలను చేరింది. శుక్రవారం కూడా 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయ లు, కిలో వెండి ధర సైతం 100 రూపాయలు పెరిగాయ. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.61 శాతం పెరిగి 1,256.90 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర కూడా 0.99 శాతం పెరుగుదలతో 18.33 డాలర్లను తాకింది.