బిజినెస్

ఎఫ్‌డిఐ విధానంపై ఆర్‌బిఐ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును రద్దు చేస్తున్న క్రమంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనల ఆమోదం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఓ ప్రామాణిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక రంగాల్లో ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఒపి) ఆధారంగా ఎఫ్‌డిఐలపై నిర్ణయాలు జరగనున్నాయి. ఎఫ్‌డిఐ ప్రతిపాదనలను ప్రస్తుతం ఎఫ్‌ఐపిబి పరిశీలించి, కేంద్ర మంత్రి వర్గానికి సిఫార్సు చేస్తోంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను ఈ నెల 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఎఫ్‌ఐపిబిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. దీంతో ఇక ఎఫ్‌ఐపిబి బాధ్యతలను కేంద్ర కేబినెట్ చూసుకోనుండగా, దీని కోసమే ఆర్‌బిఐ ఓ నిర్దిష్టమైన విధానాన్ని తయారు చేయనుంది. ఆయా రంగాల రెగ్యులేటరీ అథారిటీల సిఫార్సులతో ఎఫ్‌డిఐలపై కేబినెట్ నిర్ణయాలను తీసుకుంటుంది.