బిజినెస్

స్టీల్ ప్లాంట్‌కు బదులు సోలార్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన ఆర్సెలార్ మిట్టల్.. కర్నాటకలో తమ స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించిన భూమిలో సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ 6 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంది ఆర్సెలార్ మిట్టల్ సంస్థ. అయితే ప్రపంచ ఉక్కు అవసరాలను మించి ఉత్పాదకత జరుగుతుండటం, స్థానికంగా ఐరన్ ఓర్ లభ్యతలో ఇబ్బందుల దృష్ట్యా ఉక్కు ఉత్పత్తి కర్మాగారం కంటే సోలార్ పార్క్‌ను నెలకొల్పడం ఉత్తమమనే నిర్ణయానికి ఆర్సెలార్ మిట్టల్ వచ్చినట్లు సమాచారం. 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 750 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్‌ను 6 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు కర్నాటక ప్రభుత్వంతో ఆర్సెలార్ మిట్టల్ ఒప్పందం చేసుకుంది. 2010 జూన్‌లో కర్నాటక ప్రభుత్వంతో సంస్థ అధినేత, ప్రవాస భారతీయుడు లక్ష్మీనివాస్ మిట్టల్ ఎమ్‌ఒయు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో 2,659 ఎకరాల స్థల కేటాయింపులూ జరిగిపోయాయి. బళ్ళారిలోని కుడితిని వద్ద స్టీల్ ప్లాంట్ ప్రతిపాదన జరిగింది. అయితే ముడి సరకు సమస్యను ఎదుర్కొంటున్న సంస్థ ఇప్పటిదాకా ఆ భూమిలో పనులేమీ మొదలుపెట్టలేదు. ఈ క్రమంలో సోలార్ పవర్‌కు డిమాండ్ ఉండటంతో సౌర శక్తి కేంద్రం దిశగా అడుగులు వేస్తోంది.