బిజినెస్

రేపు ప్రభుత్వ బ్యాంకులు బంద్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ప్రభుత్వరంగ బ్యాంకులు మంగళవారం మూతబడే అవకాశాలున్నాయి. వివిధ డిమాండ్ల పరిష్కారార్థం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లు (యుఎఫ్‌బియు) బంద్ నిర్వహించే వీలుంది. యుఎఫ్‌బియు.. 9 ఉద్యోగ సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తోంది. ఈ క్రమంలో ఎస్‌బిఐ, పిఎన్‌బి, బిఒబి తదితర బ్యాంకులు తమ కస్టమర్లకు ముందుగానే బంద్ సమాచారం ఇవ్వగా, ప్రైవేట్‌రంగ బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్, కొటక్ మహీంద్ర బ్యాంకుల సేవలు యథాతథంగానే కొనసాగనున్నాయి. కాగా, భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంఘాలైన నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ మాత్రం ఈ బంద్‌కు దూరంగా ఉంటున్నాయి. ఫిబ్రవరి 21న చీఫ్ లేబర్ కమిషనర్ ఎదుట జరిగిన రాజీ సమావేశం విఫలమైందని, భారతీయ బ్యాంకుల సంఘం తమ డిమాండ్లను అంగీకరించలేదని, అందుకే బంద్‌కు వెళ్తున్నామని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం పిటిఐకి తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ)కు ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులను బాధ్యులుగా చేయడాన్ని యుఎఫ్‌బియు తప్పుబడుతోంది.