బిజినెస్

శ్రీసిటీని సందర్శించిన జపాన్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, ఫిబ్రవరి 27: నెల్లూరు-చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న శ్రీసిటీ పారిశ్రామిక వాడను సోమవారం జపాన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల బృందం సందర్శించింది. ఆ శాఖ రీజినల్ అఫైర్స్ డిడి తోరుయూ నేతృత్వంలో విచ్చేసిన ఈ బృందానికి శ్రీసిటీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రహ్మణ్యం సాదర స్వాగతం పలికి శ్రీసిటీలోని వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి ప్రత్యేకతలను వివరించారు. దీని గురించి ఆసక్తిగా తెలుసుకొన్న బృంద సభ్యులు.. సెజ్‌లోని పలు పరిశ్రమలను పరిశీలించారు. క్యాడ్‌బరీ, బయోలెక్స్ పరిశ్రమలకు వెళ్లి కంపెనీ సీనియర్ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా తోరుయూ మాట్లాడుతూ తమ పర్యటన ఉద్దేశం శ్రీసిటీలో వౌలిక వసతులతోపాటు పరిశ్రమల ఏర్పాటు, వ్యాపారాలకున్న అవకాశాలను అంచనా వేయడమేనన్నారు. థాయిలాండ్‌లో పలు పారిశ్రామిక వాడలను చూసి వచ్చామని, అయతే అక్కడకన్నా ఇక్కడ చాలా బాగుందన్నారు. జపాన్‌కు చెందిన ఆహార ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు సిఫార్సు చేస్తామన్నారు. ఇదిలావుండగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ అదనపుకార్యదర్శి అశోక్ వర్దన్ చతుర్వేది సోమవారం శ్రీసిటీకి వచ్చారు. కాల్గేట్, రాకవర్త్ పరిశ్రమలను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించారు.

చిత్రం..శ్రీసిటీలో జపాన్ బృంద సభ్యులు