బిజినెస్

ఒఎన్‌జిసి, ఒఐఎల్ రాయల్టీ చెల్లింపులకు కేంద్ర సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: గుజరాత్, అసోం రాష్ట్రాలకు ప్రభుత్వరంగ చమురు, గ్యాస్ ఉత్పాదక సంస్థలు ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియాలు చెల్లించాల్సిన రాయల్టీ బకాయిలను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. దాదాపు 22,000 కోట్ల రూపాయలను ఆ రెండు రాష్ట్రాలకు ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియా బకాయిపడగా, ఈ బకాయిల్లో వడ్డీ మినహా ఉన్న మొత్తం 14,698 కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తోంది. ఏప్రిల్ 1, 2008 నుంచి జనవరి 2014 వరకు గుజరాత్‌కు ఒఎన్‌జిసి 8,392 కోట్ల రూపాయలను ఇవ్వాల్సి ఉండగా, అసోంకు 1,404 కోట్ల రూపాయలివ్వాలి. దీనిపై మరో 2,868 కోట్ల రూపాయలు వడ్డీని చెల్లించాల్సి ఉంది. అలాగే అసోం ప్రభుత్వానికి ఆయిల్ ఇండియా 4,902 కోట్ల రూపాయల రాయల్టీని ఇవ్వాలి. మరో 4,355 కోట్ల రూపాయల వడ్డీ బాకీ. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజిని అమ్మడంతో వచ్చిన నష్టాలకు ఉత్పాదక సంస్థలు రాయల్టీని చెల్లిస్తాయన్నది తెలిసిందే. ఇలా ఆయా రాష్ట్రాలకు బకాయిలు పడగా, వాటిలో ఇప్పుడు కేంద్రం సాయం చేసింది.