బిజినెస్

రెండో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 28: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సోమవారం కూడా నష్టాలకే పరిమితమైన నేపథ్యంలో మదుపరులను జిడిపి గణాంకాల భయం వెంటాడింది. నిరుడు అక్టోబర్-డిసెంబర్ జిడిపి వృద్ధిరేటు గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ).. మార్కెట్లు ముగిశాక విడుదల చేయగా, అవి ఎలా ఉంటాయోనన్న అంచనాల మధ్య మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 69.56 పాయింట్లు కోల్పోయి 28,743.32 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 17.10 పాయింట్లు పడిపోయి 8,879.60 వద్ద నిలిచింది. చమురు, గ్యాస్ రంగాల షేర్లు 1.34 శాతం క్షీణించగా, పిఎస్‌యు, ఎఫ్‌ఎమ్‌సిజి, ఐటి, ఆటో రంగాల షేర్లు కూడా నష్టపోయాయి. అయితే రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్ రంగాల షేర్ల విలువ 1.44 శాతం మేర పెరిగింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, సింగపూర్ సూచీలు నష్టపోగా, జపాన్, చైనా సూచీలు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు నష్టాల్లో కదలాడాయి.