బిజినెస్

ఎయిరిండియా వాటాల విక్రయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 51 శాతం వాటాను కేంద్రం అమ్మేయాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే దీన్ని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే కొట్టిపారేస్తున్నారు. నష్టాల్లో నడుస్తున్న ఎయిరిండియాలో 51 శాతం వాటాను ఓ వ్యూహాత్మక భాగస్వామికి కేంద్ర ప్రభుత్వం అమ్మనుందనే వార్తలు వెలువడిన నేపథ్యంలో చౌబే వాటిని మంగళవారం ఖండించారు. కాగా, ఎయిరిండియా అధికార ప్రతినిధి ధనంజయ్ కుమార్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డిఎస్ మాలిక్ మాత్రం దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఎయిరిండియా వాటాల విక్రయం వ్యవహారం ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు, ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరినట్లు తెలుస్తోంది. 140 విమానాలతో నడుస్తున్న ఎయిరిండియాకు దేశీయ విమానయాన మార్కెట్‌లో 14.6 శాతం వాటా ఉంది. 2012లో దీనికి 30,231 కోట్ల రూపాయల నిధులను కేంద్రం ప్రకటించింది. ఇప్పటిదాకా 75 శాతం నిధులను అందుకుంది కూడా. కాగా, 2015-16 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టం 3,587 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది 5,859 కోట్ల రూపాయలుగా ఉంది.