బిజినెస్

రూ. 5,092 కోట్లు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: సెబీ-సహారా కేసులో ఏప్రిల్ 7కల్లా 5,092.6 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలంటూ సహారా గ్రూప్‌నకు సుప్రీం కోర్టు సూచించింది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న సుబ్రతా రాయ్ తిరిగి జైలుకు వెళ్లకూడదంటే తాము సూచించిన సొమ్మును నిర్దేశిత గడువులోగా సమర్పించాల్సిందేనని మంగళవారం జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సహారా తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆస్తుల అమ్మకానికి ఆరు నెలల సమయం ఇవ్వాలంటూ సహారా చేసిన ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మదుపరుల సొమ్మును త్వరగా వారికి చేర్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు సుబ్రతా రాయ్ పెరోల్‌ను ఏప్రిల్ 17 వరకు సుప్రీం కోర్టు పొడిగించింది.