బిజినెస్

జిడిపి వృద్ధిరేటు 7 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: భారత జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 7 శాతంగా ఉందని కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) మంగళవారం తెలిపింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. కాగా, అంతకుముందు రెండు త్రైమాసికాలకు సంబంధించి జిడిపి వృద్ధిరేటు అంచనాల్ని సిఎస్‌ఒ పెంచుతూ వరుసగా 7.2 శాతానికి, 7.4 శాతానికి సవరించింది.
మరోవైపు పారిస్‌కు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఒఇసిడి) భారత జిడిపి వృద్ధిరేటును ఈ ఆర్థిక సంవత్సరం 7 శాతానికే పరిమితం చేసింది. ఇంతకుముందు ఈ అంచనా 7.4 శాతంగా ఉండటం గమనార్హం. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) దేశ జిడిపి వృద్ధిరేటు అంచనాల్ని తగ్గించినది తెలిసిందే. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మందగించిన దేశ ఆర్థిక కార్యకలాపాలే ఇందుకు ప్రధాన కారణం. ఈ భయాన్ని తాజాగా సిఎస్‌ఒ కూడా వ్యక్తం చేసింది. అయితే నోట్ల రద్దు నిర్ణయం ప్రయోజనాలు ఏప్రిల్ నుంచి కనిపిస్తాయన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యక్తం చేస్తోంది. కొత్త నోట్ల పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, దీనివల్ల వినీమయం పెరుగుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. ఇదిలావుంటే నికర జాతీయ తలసరి ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరానికిగాను 1,03,818 రూపాయలుగా సిఎస్‌ఒ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇది 94,178 రూపాయలుగా ఉంది.