బిజినెస్

టాటాలపై డొకొమోదే పైచేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: జపాన్ టెలికామ్ దిగ్గజం ఎన్‌టిటి డొకొమోకు 1.18 బిలియన్ డాలర్లను చెల్లించేందుకు టాటా సన్స్ అంగీకరించింది. టాటా గ్రూప్‌లోని టెలికామ్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్, డొకొమో కలిసి జాయింట్ వెంచర్‌లో భాగంగా దేశీయంగా టెలికామ్ సేవలను అందిస్తున్నది తెలిసిందే. అయితే ఇరు సంస్థల మధ్య తలెత్తిన వివాదంలో భాగంగా దాని పరిష్కారానికి 1.18 బిలియన్ డాలర్లను డొకొమోకు చెల్లించడానికి టాటా సన్స్ ఆమోదం తెలిపింది. ఈ వ్యవహారం ఢిల్లీ హైకోర్టులో ఉండటంతో కేసును ముగించాల్సిందిగా ఇరు సంస్థలు న్యాయస్థానాన్ని కోరాయి కూడా. టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తి నిరుడు ఉద్వాసనకు గురైన నేపథ్యంలో ఇటీవలే టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ బాధ్యతలు చేపట్టిన క్రమంలో డొకొమోతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరపడటం గమనార్హం. 2009లో టాటా టెలీసర్వీసెస్‌లోని 26.5 శాతం వాటాను ఒక్కో షేర్‌కు 117 రూపాయల చొప్పున మొత్తం 12,740 కోట్ల రూపాయలకు డొకొమో కొనుగోలు చేసింది. అయితే 2014లో వ్యాపారపరమైన కారణాల దృష్ట్యా జాయింట్ వెంచర్ నుంచి బయటకు రావాలనుకున్న డొకొమో.. టాటాల నుంచి ఒక్కో షేర్‌కు 58 రూపాయల చొప్పున (7,200 కోట్ల రూపాయలు) తిరిగిచ్చేయాలని కోరింది. కానీ ఒక్కో షేర్‌కు 23.34 రూపాయల చొప్పున మాత్రమే ఇస్తానంది. దీంతో టాటాలను అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు డొకొమో లాగింది. అక్కడ 1.18 బిలియన్ డాలర్ల పరిహారాన్ని డొకొమో గెలుచుకుంది. ఈ తీర్పును అమలుపరచాలని ఢిల్లీ హైకోర్టునూ డొకొమో ఆశ్రయించగా, ఇన్నాళ్లకు ఈ వివాదం టాటాల ఆమోదంతో ఇలా పరిష్కారమైంది.