బిజినెస్

చివర్లో తడబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 36.20 పాయింట్లు పుంజుకుని 25,880.38 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ స్వల్పంగా 2.70 పాయింట్లు కోల్పోయి 7,912.05 వద్ద నిలిచింది. ఉదయం ఆరంభంలో భారీ లాభాల్లోనే కదలాడిన సూచీలు మార్కెట్లు ముగిసే సమయానికి మాత్రం డీలాపడ్డాయి. బుధవారం సైతం ఇలాగే జరగగా, సెనె్సక్స్ 28 పాయింట్లు పెరిగితే, నిఫ్టీ దాదాపు యథాతథంగా ముగిసింది.
కాగా, గురువారం ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఫైనాన్స్, చమురు, గ్యాస్, మెటల్, హెల్త్‌కేర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే ఐటి, రియల్టీ, టెక్నాలజీ, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చాలా సూచీలు లాభాలను అందుకోగా, ఐరోపా మార్కెట్లలోనూ సూచీలు మోస్తరు లాభాలను పొందాయి.