బిజినెస్

‘ఇక నోటీసులే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన బ్యాంక్ డిపాజిట్లపై సంబంధీకులకు ఇచ్చిన ఎస్‌ఎమ్‌ఎస్‌లకు, ఈ-మెయిల్స్‌కు స్పందించనివారిపట్ల ఆదాయ పన్ను శాఖ కనె్నర్ర చేస్తోంది. వీరందరికి నోటీసులను జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 133(6) ప్రకారం ఈ నోటీసులను జారీ చేయనుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబిడిటి) శుక్రవారం తెలియజేసింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే. రద్దయిన నోట్ల స్థానంలో కొత్త 500, 2,000 రూపాయల నోట్లను తీసుకురాగా, పాత పెద్ద నోట్లను డిసెంబర్ ఆఖరుకల్లా బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, వాటికి సమాన విలువైన కొత్త నోట్లను పొందవచ్చని మోదీ చెప్పారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డిపాజిట్లు జరగగా, ఆదాయ పన్ను శాఖ నిశితంగా గమనించింది. ఆదాయానికి, డిపాజిట్లకు పొంతనలేని ఖాతాదారులందరి నుంచి వివరణ కోరుతూ ఎస్‌ఎమ్‌ఎస్‌లు, ఈ-మెయిల్స్ పంపింది. డిపాజిట్ చేసిన ఆ సొమ్ము ఎక్కడిదని వాటిలో ప్రశ్నించింది. దీనికి స్పందించని వారికే ఇప్పుడు నోటీసులు జారీ చేయాలని ఐటి శాఖ భావిస్తోంది.