బిజినెస్

హిందుస్థాన్ జింక్ లాభం రూ. 2,149 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 7.59 శాతం వృద్ధి చెంది 2,149.13 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఎన్నారై బిలియనీర్ అనీల్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ సంస్థ అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 1,997.44 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆదా యం ఈసారి 3,132.39 కోట్ల రూపాయలుగా, పోయినసారి 4,125.68 కోట్ల రూపాయలుగా ఉంది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్
ముంబయి: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఇండస్‌ఇండ్ బ్యాంక్ నికర లాభం ఈ జనవరి- మార్చి త్రైమాసికంలో 25.25 శాతం పెరిగి 620.35 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 495.27 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. ఆదాయం ఈసారి 4,044.49 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 3,27 8.06 కోట్ల రూపాయలుగా ఉంది.
సుప్రీమ్ ఇండస్ట్రీస్
న్యూఢిల్లీ: ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ సుప్రీమ్ ఇండస్ట్రీస్ ఏకీకృత లాభం ఈ జనవరి-మార్చి వ్యవధిలో 12.06 శాతం పెరిగి 114.56 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత జనవరి-మార్చిలో 102.2 3 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదా యం ఈసారి 1,200.30 కోట్ల రూపాయలుగా, అంతకుముందు 1,151.74 కోట్ల రూపాయలుగా ఉంది.
టివి18 బ్రాడ్‌కాస్ట్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన టివి18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ నికర లాభం ఈ జనవరి-మార్చిలో 13.57 శాతం క్షీణించి 82.51 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 95.47 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఆదాయం ఈసారి 671.33 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 629.74 కోట్ల రూపాయలుగా ఉంది.
సైయెంట్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఐటిరంగ సంస్థ సైయెంట్ నికర లాభం ఈ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 29.7 శాతం పడిపోయి 65.9 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు 93.8 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆదాయం ఈసారి 815.8 కోట్ల రూపాయలుగా, పోయినసారి 730 కోట్ల రూపాయలుగా ఉంది.