బిజినెస్

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దుస్థితికి లోపాలున్న ఇంజిన్లూ కారణమే: మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుత పరిస్థితికి లోపభూయిష్టమైన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లు కూడా కారణమేనని విజయ్ మాల్యా అన్నారు. మాల్యా నేతృత్వంలోని ఈ విలాసవంతమైన ఎయిర్‌లైన్స్.. బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే. తీసుకున్న రుణాలు చెల్లించడంలో విఫలమైన మాల్యా.. లండన్‌కు పారిపోయినదీ విదితమే. ఈ క్రమంలో శుక్రవారం ట్విట్టర్‌లో కింగ్‌ఫిషర్‌కు ప్రాట్ అండ్ వైట్నీ గ్రూప్‌నకు చెందిన ఓ సంస్థ లోపాలున్న ఇంజిన్లను సరఫరా చేసిందని చెప్పారు. దేశీయంగా కొన్ని ఎయిర్‌బస్ 320 నియో విమానాలు ప్రాట్ అండ్ వైట్నీ రూపొందించిన ఇంజిన్లతోనే నడుస్తున్న క్రమంలో దీనిపై డిజిసిఎ సమగ్ర తనిఖీలకు ఆదేశించిన నేపథ్యంలో మాల్యా పైవిధంగా స్పందించారు. డిజిసిఎ ఆదేశాలు ఆశ్చర్యకరంగా లేవని, ప్రాట్ అండ్ వైట్నీ ఇంజిన్లతోనే కింగ్‌ఫిషర్ విమానాలు మూలనపడటం బాధాకరమని ఆయన ట్విట్టర్‌లో అన్నారు. 2012లో దేశీయ ప్రైవేట్‌రంగ సంస్థ అయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సేవలు నిలిచిపోయాయి.