బిజినెస్

అప్లైడ్ మెటీరియల్స్ సిటిఒకు అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: అమెరికాలోని నేషనల్ అకాడమి ఆఫ్ ఇంజినీరింగ్ (ఎన్‌ఎఇ) అవార్డుకు అప్లైడ్ మెటీరియల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ ఓమ్ నలమసు ఎంపికయ్యారు. మెటీరియల్స్ అభివృద్ధి, ఆటోమేటిక్‌గా నియంత్రించబడే థిన్-్ఫల్మ్ ఫ్యాబ్రికేషన్, మైక్రో ఎలక్ట్రానిక్స్ కమర్షియలైజేషన్, ఇంధన సృష్టి, నిల్వ వంటి అంశాలలో చేసిన సాంకేతిక ఆవిష్కరణలకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యా రు. ఇంజినీర్లకు సంబంధించి ఇది అత్యున్నత గౌరవంగా అప్లైడ్ మెటీరియల్స్ ప్రెసిడెంట్, సిఈఓ గారీ డికర్‌సన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతిష్టాకరమైన ఈ అవార్డు ఆయన కెరీర్‌లో చేసిన ఎన్నో విప్లవాత్మక ఆవిష్కరణలకు గుర్తింపుగా అభివర్ణించారు. హైదరాబాద్‌లో జన్మించిన ఓమ్.. ఒయులో బిఎస్‌సి, హెచ్‌సియులో ఎంఎస్‌సి చేశారు. అనంతరం కెనడాలో పిహెచ్‌డి పూర్తి చేశారు.