బిజినెస్

భారతీయ సంస్థలకు వీసా భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: భారత ఆర్థిక వ్యవస్థను విదేశీ వీసాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఓ వైపు అమెరికా హెచ్1-బి వీసాల భయం వెంటాడుతుండగానే, మరోవైపు ఆ అగ్రరాజ్యం పొరుగు దేశమైన కెనడాతోనూ వీసా ఇబ్బందులు నెలకొన్నాయి. దీంతో భారతీయ సంస్థలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. కెనడా తమ దేశంలో తాత్కాలిక విదేశీ ఉద్యోగుల విధానంలో మార్పులు చేస్తుండటం దీనికి కారణం. దీనివల్ల కెనడాలోని తమ అనుబంధ సంస్థలకు స్వల్పకాలిక వీసాలపై ఉద్యోగులను పంపించాలంటే సమస్యలు తలెత్తుతాయని భారతీయ సంస్థలు అంటున్నాయి. ఫలితంగా వాణిజ్య సేవలు ప్రభావితమవుతాయని చెబుతున్నాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఈ అంశాన్ని ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న కెనడా అధికార బృందం వద్ద ప్రస్తావించారు. దీంతో నిపుణులైన ఉద్యోగుల వీసాలకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా చర్యలు తీసుకుంటామన్న హామీనిచ్చారు. కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి ఫ్రాంకోయిస్-్ఫలిప్పె చాంపేన్, సీతారామన్ మధ్య శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ‘సంస్థాగతంగా జరిగే అంతర్గత ఉద్యోగ బదిలీల్లో స్వల్పకాలిక వీసాల ప్రాముఖ్యాన్ని, వాటి అవసరాన్ని కెనడా మంత్రికి సీతారామన్ వివరించారు.’ అని శనివారం ఓ ప్రకటనలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తాత్కాలిక ఫారిన్ వర్కర్ల ప్రోగ్రామ్‌లో మార్పుల వల్ల కెనడాలో పెట్టుబడులు పెట్టిన పలు భారతీయ సంస్థలు.. ఇక తమ ఉద్యోగులను అక్కడికి పంపించడం ఎలా? అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నట్లు కెనడా మంత్రికి సీతారామన్ చెప్పినట్లు ఆ ప్రకటన పేర్కొంది. దీంతో భారత్ నుంచి వచ్చే నిపుణులకు ఇబ్బందులు కలగకుండా తప్పక చర్యలు తీసుకుంటామని కెనడా మంత్రి ఫిలిప్పె హామీ ఇచ్చినట్లు సదరు ప్రకటన చెప్పింది. అంతేగాక విశ్వ నైపుణ్య వ్యూహ కార్యక్రమంలో భాగంగా రెండు వారాల్లోనే అత్యధిక నిపుణత కలిగిన టెక్నీషియన్లు, ప్రొఫెసర్లు, రిసెర్చర్ల వీసా దరఖాస్తులను ఆమోదించనున్నట్లు చెప్పారు. మళ్లీమళ్లీ కెనడాకు వచ్చేలా వారి కోసం వీసా విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. ప్రాధాన్యత ప్రకా రం ఆయా సంస్థలకూ ఇదే విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఇదిలావుంటే భారత్-కెనడా ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రగతి-రక్షణ ఒప్పం దం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాల (సిఇపిఎ) అమలును వేగవంతం చేయాలని కూడా ఇరు దేశాల మంత్రులు ఓ అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య వస్తు రవాణాపై పన్నులను గణనీయంగా తగ్గించే సిఇపిఎ అమలు కోసం 2010 నుంచి చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్- కెనడా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 8 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఇది చాలా తక్కువని, ఇది పెరిగేందుకు సిఇపిఎ ఎంతగానో దోహదపడుతుందని, కాబట్టి త్వరగా దీని అమలుకు ముమ్మర ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. కాగా, విదేశీ పెట్టుబడులకు రక్షణ కల్పించే ఫారిన్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ (ఎఫ్‌ఐపిఎ) అవసరాన్ని ఈ సందర్భంగా కెనడా మంత్రి గుర్తుచేశారు. ఇకపోతే కెనడా నుంచి భారత్‌కు పప్పు్ధన్యాల దిగుమతికి సంబంధించి తీర్మానం జరగాలని కూడా ఆ దేశ మంత్రి సీతారామన్‌తో అన్నారు. దీంతో వ్యవసాయ మంత్రిత్వ శాఖతో దీనిపై చర్చిస్తానని సీతారామన్ హామీ ఇచ్చారు. ఇక ఈ నెలాఖర్లోగా కెనడా సిఇఒ ఫోరమ్‌ను పునర్నిర్మిస్తామని ఫిలిప్పె స్పష్టం చేశారు. ఇప్పటికే భారత సిఇఒ ఫోరమ్ పునర్నిర్మాణమైంది. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాల విధానంతో భారతీయ ఐటి రంగ సంస్థలు ఇబ్బందులకు గురవుతుండగా, కెనడా వీసా విధానం మార్పులతో ఇతర రంగాల భారతీయ సంస్థలు చిక్కుల్లో పడుతున్నాయి.