బిజినెస్

అత్యుత్తమ సేవల్లో ప్రపంచంలోనే హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అగ్రగామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: అత్యుత్తమ విమానాశ్రయ సేవల్లో జిఎమ్‌ఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఎసిఐ)- ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఎఎస్‌క్యు) అధ్యయనంలో జిఎమ్‌ఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ ఎయిర్‌పోర్టు (జిహెచ్‌ఐఎఎల్)కు ప్రథమ స్థానం దక్కింది. ఏటా 5-15 మిలియన్ ప్రయాణికుల విభాగంలో 2016కుగాను ఈ ఘనతను జిహెచ్‌ఐఎఎల్ సాధించింది. దీనికి కారణమైన వారందరికీ సోమవారం ఓ ప్రకటనలో జిహెచ్‌ఐఎఎల్ కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు 40 మిలియన్లకుపైగా ప్యాసింజర్ల విభాగంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచంలో రెండో స్థానం దక్కింది. ఇది కూడా జిఎమ్‌ఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్నదే కావడం గమనార్హం.