బిజినెస్

పొగాకు నియంత్రణ అప్రజాస్వామిక నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, ఏప్రిల్ 21: పొగాకు, పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) ప్రజాస్వామ్యయుతంగా నిర ణయం తీసుకోవడంలేదని అంతర్జాతీయ పొగాకు ఉత్పత్తిదారుల సంఘం సిఇఒ అంటోనియో ఆబ్రూ న్ హోసా (పోర్చుగల్) అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో పొగాకు, పొగాకు ఉత్పత్తుల స్థితిగతులను పరిశీలించడంలో భాగంగా గురువారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పొగాకు, పొగాకు ఉత్పత్తులను 2020 నాటికి నిషేధించాలని 2004లో డబ్ల్యుహెచ్‌ఒ చేసిన ప్రతిపాదనను భారత్ సహా 178 దేశాలు ఆమోదించాయని గుర్తుచేశారు. అయితే అమెరికా, ఇండోనేషియా, అర్జంటీనా, మలాని, కొన్ని ఆఫ్రికా దేశాలు ఈ ప్రతిపాదనను ఆమోదించలేదన్నారు. ఆమోదించిన దేశాలు ప్రతి సంవత్సరం పది శాతం చొప్పున ఉత్పత్తులు తగ్గిస్తూ వస్తున్నాయని, అయితే ఈ విషయంలో వ్యవసాయ నిపుణులు పొగాకు రైతుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోలేదన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కేవలం 550 మంది ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వంద మిలియన్ల మంది రైతులు, కూలీలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక 2020 తర్వాత భారత్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.57 కోట్ల మంది జీవనోపాధి కోల్పోయే వీలుందన్నారు. కాగా, పొగాకు నిషేధంపై ఈ ఏడాది నవంబర్‌లో న్యూఢిల్లీలో డబ్ల్యూహెచ్‌ఒ నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో పొగాకు ఉత్పత్తిదారుల ప్రతినిధులుగా తమ వాదనలు వినిపిస్తామన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 0.3 శాతం నికోటిన్ ఉన్న సిగరెట్‌ను ఉత్పత్తి చేయాలని, అయితే మార్కెట్‌లో 1.8 శాతం నికోటిన్ ఉన్న సిగరెట్లు ఉత్పత్తవుతున్నాయన్నారు. ప్రపంచంలోనే సిగరెట్ల వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అక్రమంగా విదేశీ సిగరెట్లు భారత్‌లోనికి దిగుమతి కావడంవల్లే ఇక్కడ పొగాకుకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే సంగాయగూడెం, చిన్నాయగూడెం గ్రామాల్లో పర్యటించిన హోసా పొగాకు రైతులతో ముచ్చటించారు.

చిత్రం దేవరపల్లి వేలం కేంద్రంలో రైతులతో
కలిసి పొగాకు బేళ్లను పరిశీలిస్తున్న హోసా