బిజినెస్

జిసిసి కుంకుమకు డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 6: ఎటువంటి రసాయనాలు కలపని నాణ్యమైన జిసిసి కుంకుమకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇంతవరకు ఎక్కడా అందుబాటులో లేని ఛాయ కలిగిన ఈ కుంకుమను తీసుకునేందుకు పుణ్యక్షేత్రాలు ముందుకొస్తున్నాయి. మహానంది, శ్రీశైలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి జిసిసికి భారీగా ఆర్డర్లు కూడా లభించాయి. సింహాచలం, అన్నవరం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం, అరసవెల్లి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల నుంచి కూడా ఆర్డర్లు తీసుకునేందుకు జిసిసి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అయతే ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక జిసిసి వ్యాపార లక్ష్యాలు నీరుగారిపోతున్నాయ. ఆరు మాసాల కిందట కొత్తగా కుంకుమ పొడిని తయారు చేసి విక్రయించే సరికొత్త పథకానికి జిసిసి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రెండు నుంచి మూడు వేల కిలోల కుంకుమ పొడిని ప్యాకెట్ల ద్వారాను, విడిగాను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ పసుపు పంట విశాఖ జిల్లాలో ఆశించిన స్థాయిలో దిగుబడి కావడం లేదు. ఈ పంట పండించే రైతులు దీనిపట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదన్నది స్పష్టమవుతోంది. తగ్గిన భూసారం, పెట్టుబడి భారం, పంటకు ఉపయోగించే కొమ్ములు సమకూర్చుకోలేకపోతుండటం వంటి కారణాలతో ఈ పంట అందుబాటులోకి రావడం లేదు. గిరిజనులకు ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేదన్నదీ నిజమే. దీంతో కుంకుమ తయారీ పడిపోతోంది. మరోవైపు లక్ష్యాల సాధనకు దూకుడుగా వ్యవహరించవద్దని, దీని గురించి నెమ్మదిగా ముందుకు వెళ్ళాలన్న ప్రభుత్వ సూచనలతో సంస్థ ఇపుడు అయోమయంలో పడింది. ప్రభుత్వం నుంచి నిధులు కూడా పెద్దగా మంజూరు కావడం లేదు. దీంతో కుంకుమ వ్యాపారం పెంచుకునేందుకు జిసిసి పెడుతున్న పరుగులకు బ్రేకులు పడుతున్నాయ.