బిజినెస్

కోల్ ఇండియా మధ్యంతర డివిడెండ్ రూ. 18.75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను ఒక్కో షేర్‌కు 18.75 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను ఇచ్చేందుకు తమ బోర్డు అంగీకరించిందని సోమవారం ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలియజేసింది. 10 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌కు ఈ డివిడెండ్‌ను అందించాలని కోల్ ఇండియా ఆడిట్ కమిటీ సిఫార్సు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, కోల్ ఇండియాలో 79 శాతానికిపైగా వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి సుమారు 9,200 కోట్ల రూపాయల నిధులు అందనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం కూడా ఇలాగే 11,500 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వానికి వచ్చాయి.