బిజినెస్

పునరాలోచించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. ఏప్రిల్ 1 నుంచి సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ తోపాటు ఎటిఎం సేవలపై మళ్లీ చార్జీలను తీసుకొస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. ఖాతాదారుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగా 2012లో మినిమం బ్యాలెన్స్ పరిమితిని, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎటిఎం సేవలపై చార్జీలను ఎస్‌బిఐ ఎత్తివేసింది. అయతే పెరుగుతున్న పనిభారం, మూలధనం కొరతతో దాదాపు ఐదేళ్ల తర్వాత ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ను కొనసాగించని పక్షంలో పెనాల్టీని తిరిగి విధించాలని నిర్ణయించింది. ఎటిఎం చార్జీలనూ ప్రవేశపెడు తోంది. కానీ దీనిపై పునరాలోచించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎస్‌బిఐకి సోమవారం సూచించింది. దేశంలోని అత్యధికులకు బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నది ఎస్‌బిఐనే. ఐదు అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్‌బిఐ కస్టమర్లు మరింత పెరగనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోని దాదాపు సగం జనాభాకు బ్యాంకింగ్ సేవలు లభించేది ఇకపై ఎస్‌బిఐ ద్వారానే. కానీ పొదుపు ఖాతాల్లో 5,000 రూపాయల కనీస నగదును ఉంచాలని, లేకుంటే జరిమానా తప్పదని తాజాగా ఎస్‌బిఐ స్పష్టం చేసింది. ఆరు మెట్రో నగరాల్లోని ఖాతాదారులకు ఇది వర్తించనుం డగా, నిర్ణీత నగదులో 75 శాతం లేకుంటే సేవా పన్నుతోపాటు 100 రూపాయల జరిమానా, 50 శాతం లేనిపక్షంలో సేవా పన్ను, 50 రూపాయల జరిమానా పడుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాలో ఉండాల్సిన కనీస నగదు వెయ్య రూపాయలైతే, అది లేకుంటే 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు జరిమానా తప్పదు. అర్బన్ శాఖల్లోని సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీసం 3,000 రూపాయలను, సెమీ అర్బన్ శాఖల్లోని సేవింగ్స్ ఖాతాదారులైతే 2,000 రూపాయలు తగ్గకుండా నగదును ఉంచుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా సేవింగ్స్ ఖాతాదారులు చెక్కు బుక్కు సౌకర్యం లేకుంటే ఖాతాల్లో కనీసం 500 రూపాయలుంచాలని, చెక్కు బుక్కుంటే 1,000 రూపాయలుంచాలని ఎస్‌బిఐ తేల్చి చెప్పింది. దీంతో 31 కోట్లకుపైగా సేవింగ్స్ ఖాతాదారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా వీరిలో పెన్షనీర్లు, విద్యార్థులుండటంతో ఈ నిర్ణయంపై మరొక్కసారి ఆలోచించుకోవాలని ప్రభుత్వం కోరినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయ. అంతేగాక ఎటిఎం సేవలపై చార్జీల విషయంలోనూ పునరాలోచించుకోవాలని ప్రభుత్వం కోరింది. ఖాతాదారులు ఇతర బ్యాంకులకు చెందిన ఎటిఎంలలో నెలకు మూడుసార్లు మాత్రమే ఉచితంగా నగదును ఉపసంహరించుకోవచ్చని (విత్‌డ్రా), అది దాటితే ఒక్కో లావాదేవీకి 20 రూపాయల చొప్పున చార్జ్ చేస్తామని ఎస్‌బిఐ ప్రకటించింది. సొంత బ్యాంక్ ఎటిఎంలలో నెలకు ఐదుసార్లు ఉచితంగా నగదును తీసుకొవచ్చని, అది దాటితే ఒక్కో లావాదేవీకి 10 రూపాయల చొప్పున చార్జ్ చేస్తామని ఎస్‌బిఐ స్పష్టం చేసింది. కాగా, ఏప్రిల్ 1న ఎస్‌బిఐలో దాని అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ విలీనం కానున్నాయ. దీంతో ఎస్‌బిఐ అసెట్ బేస్ 37 లక్షల కోట్ల రూపాయలకు, శాఖలు 22,500లకు, ఎటిఎంలు 58,000లకు, కస్టమర్ల సంఖ్య 50 కోట్లకుపైగా చేరనుంది. ఈ క్రమంలో ఎస్‌బిఐ తాజా నిర్ణయం దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవలను అందిస్తామన్న ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీస్తుందన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతు న్నాయ. ముఖ్యంగా నిరుపేదలకిచ్చిన జన్‌ధన్ ఖాతాలతోపాటు, మధ్యతరగతి ప్రజానీకం పొదుపు ఖాతాలు చిక్కుల్లో పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పాత పెద్ద నోట్ల రద్దుతో ఇంకా నగదు కొరత కనిపిస్తుండటం కూడా ప్రజల్లో దీనిపట్ల వ్యతిరేకత వస్తుందన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే మరోసారి మినిమం బ్యాలెన్స్ పరిమితి, ఎటిఎం సేవలపై చార్జీలపట్ల ఆలోచించాలని ఎస్‌బిఐకి ప్రభుత్వం గట్టిగానే సూచిస్తోంది.
70 శాతం వ్యతిరేకం
మరోవైపు ప్రైవేట్‌రంగ బ్యాంకులు నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలపై విధించిన చార్జీలను 70 శాతం ఖాతాదారులు వ్యతిరేకిస్తున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు కష్టాలు కొలిక్కి వస్తుండటం, నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా ఖాతాదారుల నగదు లావాదేవీలపై ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్‌లు పెను భారం మోపాయి. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు నెలలో నాలుగుసార్లు మించితే ఒక్కో లావాదేవికి ఏకంగా 150 రూపాయలను వసూలు చేస్తామని ప్రకటించాయి. సేవింగ్స్ ఖాతాలతోపాటు వేతన ఖాతాదారులకు (సాలరీ అకౌంట్స్) ఈ చార్జీలు వర్తిస్తాయని, ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని చెప్పాయ. అయతే దీనిపై లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన అధ్యయనంలో 70 శాతం మంది వ్యతిరేకత కనబరిచారు. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచించుకోవాలని ప్రైవేట్‌రంగ బ్యాంకర్లను కోరింది.