బిజినెస్

అక్టోబర్-డిసెంబర్ జిడిపి వృద్ధిపై ఫిచ్ రేటింగ్స్ ఆశ్చర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారత జిడిపి వృద్ధిరేటు 7 శాతానికిపైగా నమోదు కావడం ఆశ్చర్యంగా ఉందని అమెరికాకు చెందిన రేటింగ్ దిగ్గజం ఫిచ్ రేటింగ్స్ మంగళవారం వ్యాఖ్యానించింది. ఇటీవల కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) అక్టోబర్-డిసెంబర్ జిడిపి వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదైందని ప్రకటించినది తెలిసిందే. దీనిపై ఇతర ఆర్థిక నిపుణులు, వ్యాపార, పారిశ్రామిక రంగాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయగా, ఇప్పుడు అదే బాటలో ఫిచ్ రేటింగ్స్ కూడా ఆశ్చర్యం వెలిబుచ్చింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశ జిడిపి అంచనాల్ని ఆర్‌బిఐ, ప్రపంచ బ్యాంక్‌సహా అన్ని తగ్గిస్తున్నది తెలిసిందే. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం భారత జిడిపి వృద్ధిరేటు 7.1 శాతంగా, వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలు 7.7 శాతంగా ఉండొచ్చని చెప్పింది.