బిజినెస్

సహకార బ్యాంకులకు నోట్ల రద్దు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 7: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా లక్ష్యాలు చేరుకోవడం కష్టతరంగా మారింది. నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా డిసిసి బ్యాంకులోనూ ఇదే పరిస్థితి. రైతులు బకాయిలు చెల్లిస్తేనే మళ్ళీ రుణ సదుపాయం పొందగలుగుతారు. అంటువంటిది కేంద్రం నిబంధనలతో రైతులు తమ బకాయిలు చెల్లించలేక, తిరిగి రుణాలను పొందలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోపక్క పాత బకాయిలు మొండికేస్తున్నాయి. అవి ఏమాత్రం వసూలు కావడం లేదంటూ బ్యాంకుల ఫీల్డ్ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్‌లు) ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు, లాభసాటిగా లేని పలు రకాలైన పంటలు, కరవు పరిస్థితులు, స్వల్ప రుణాలకు చక్రవడ్డీల భారం, ఖరీఫ్, రబీ సీజన్‌లో పంటలు అందుబాటులోకి రాకపోవడం వంటి అనేక కారణాలు రైతులను వెంటాడుతున్నాయి. దీనివల్ల సహకార బ్యాంకుల ఆర్థిక లక్ష్యాలు నెరవేరడంలేదు. గత మూడేళ్ళ కాలంగా ఇవే పరిస్థితులుండగా, వీటికి పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం తోడైంది. రైతులు పండించే వరి, చెరకు, పత్తి, శనగ తదితర పంటలకు సహకార బ్యాంకులు ప్రతి ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రుణాలు మంజూరు చేయడం, వీటిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పిఎసిఎస్‌లు) ద్వారా అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎకరా నుంచి వ్యవసాయ భూములు కలిగి ఉండే ప్రతి ఒక్క రైతు.. సొసైటీల్లో సభ్యుడైతే రుణాన్ని పొందే అర్హత పొందుతాడు. రాష్ట్రంలో 13 జిల్లాల డిసిసి బ్యాంకులకు సంబంధించి దాదాపు 14 లక్షల మంది రైతు సభ్యులుండగా, ప్రతి ఒక్క జిల్లాలో 100కిపైగానే పిఎసిఎస్‌లు నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 డిసిసి బ్యాంకుల ద్వారా ప్రతి ఏడాది ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని సాధిస్తుండగా, నోట్ల రద్దు తరువాత ఇది కాస్త తగ్గిపోయింది. డిపాజిట్ల సేకరణ సమస్యగా మారగా, బంగారంపై రుణాల మంజూరు శాతం కూడా గణనీయంగా పడిపోయింది. వీటితోపాటు రైతులకు మంజూరు చేసిన రుణాల వసూళ్ళ శాతం 80 నుంచి 60కి పడిపోయింది. విశాఖ జిల్లాకు సంబంధించి ప్రతి ఏడాది నూరు శాతం బకాయిలు వసూళ్ళు కాగా, నోట్ల రద్దు ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఇంకా 60 నుంచి 70 శాతం వరకే వసూళ్ళు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వసూళ్ళ శాతం తగ్గిందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క నాబార్డు, ఆప్కాబ్‌ల నుంచి అందించే సహకారం అంతంత మాత్రంగానే ఉందని ఈ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8న పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. దీంతో దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగాల వృద్ధి కుంటుపడగా, బ్యాంకింగ్ పరిశ్రమ కూడా కుదేలైంది.