బిజినెస్

తెలంగాణలో తొలి మహిళా ఇండస్ట్రియల్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణలో తొలి మహిళా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పడబోతోంది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఇందుకోసం ఇప్పటికే 50 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది. భూమి కేటాయింపునకు సంబంధించి కొంత మంది మహిళా పారిశ్రామికవేత్తలకు సర్ట్ఫికెట్లను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ బుధవారం జరిగే ఒక సమావేశంలో అందజేస్తారు. తెలంగా ణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ (టిఎస్‌ఐఐసి) కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం ఏర్పాటు చేస్తున్నారు. మహిళా ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించి కెటిఆర్ ఈ సందర్భంగా ఒక ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఓ), మహిళా పారిశ్రామికవేత్తల ఆర్గనైజేషన్ (సిఓడబ్ల్యుఇ) ప్రతినిధులతో మంత్రి కెటిఆర్ చర్చలు జరుపుతారు.