బిజినెస్

బిలియనీర్లకు నోట్ల రద్దు సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: భారతీయ కుబేరులపై పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం కనిపించింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8న పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. దీంతో దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగాల వృద్ధి కుంటుపడగా, ఆయా రంగాల్లోని సంపన్నుల సంపద కూడా పడిపోయింది.
అయినప్పటికీ ఎప్పట్లాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ.. దేశంలోని బిలియనీర్లకు నాయకత్వం వహిస్తుండటం గమనార్హం. 2016కుగాను హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ఇండియా మంగళవారం వెల్లడైంది. ఇందులో 26 బిలియన్ డాలర్లతో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలవగా, రెండో స్థానంలో హిందుజా కుటుంబం, మూడో స్థానంలో సన్ ఫార్మా అధినేత ముకేశ్ అంబానీ ఉన్నారు. అయితే పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 11 మంది ఈ బిలియనీర్ల జాబితా నుంచి వైదొలిగారు.
వీరిలో ఈ-కామర్స్ వ్యాపారులు సచిన్ బన్సల్, బిన్ని బన్సల్ కూడా ఉండగా, పతంజలికి చెందిన ఆచార్య బాలకృష్ణ 3.7 బిలియన్ డాలర్లతో 27వ స్థానంలో ఉన్నారు. కాగా, ఒక బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపద కలిగినవారు దేశంలో ఇప్పుడు 132 మంది ఉన్నట్లు తాజా జాబితా స్పష్టం చేసింది. వీరి మొత్తం సంపద 392 బిలియన్ డాలర్లు. ఇదిలావుంటే భారత్ నుంచి 32 మంది బిలియనీర్లు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారని, యుఎఇకి అత్యధికంగా 13 మంది పోయారని హరున్ రిపోర్ట్ ఇండియా ఎండి అనస్ రహ్మాన్ జునైద్ తెలిపారు. ముంబయి నగరంలో ఎక్కువగా 42 మంది బిలియనీర్లున్నారని, ఢిల్లీలో 21 మంది, అహ్మదాబాద్‌లో 9 మంది బిలియనీర్లున్నారని చెప్పారు.
అలాగే రాష్ట్రాలవారీగా మహారాష్టల్రో అధికంగా 51 మంది బిలియనీర్లుండగా, ఢిల్లీలో 22, గుజరాత్‌లో 10, కర్నాటకలో 9 మంది ఉన్నారు.