బిజినెస్

నిరర్థక ఆస్తులపై నేడు ఉన్నత స్థాయి సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 9: బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు గణనీయంగా పెరగడం వలన ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు రిజర్వు బ్యాంకు అధికారులు శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి అంజూలీ చిబ్ దుగ్గల్ కూడా హాజరుకానున్నారు. నిరర్థక ఆస్తుల సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ ఆధీనంలో అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎఆర్‌సి)ని లేదా బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సూచించగా, ప్రైవేట్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (పిఎఎంసి)తో పాటు నేషనల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఎన్‌ఎఎంసి)ని ఏర్పాటు చేయాలని రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య ప్రతిపాదించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గత ఆర్థిక సంవత్సరం జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికం చివరి నాటికి రూ.5.5 లక్షల కోట్లుగా ఉన్న నిరర్థక ఆస్తులు రెండో త్రైమాసికం ముగిసే నాటికి (సెప్టెంబర్ 30వ తేదీ నాటికి) రూ.6.3 లక్షల కోట్లకు పెరిగాయి.