బిజినెస్

మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లతో కొత్త 10 రూపాయల నోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 9: భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) త్వరలో మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన కొత్త 10 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురానుంది. మహాత్మా గాంధీ సిరీస్-2005లోని ఈ బ్యాంకు నోట్లు రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో పాటు రెండు వైపులా నెంబర్ పానళ్లపై అంతర్గతంగా (ఇన్‌సెట్‌లో) ఆంగ్ల అక్షరం ‘ఎల్’ను కలిగి ఉంటాయని, ఈ నోట్లను ముద్రించిన 2017 సంవత్సరం నోటు వెనుక భాగంలో ఉంటుందని ఆర్‌బిఐ గురువారం వెల్లడించింది. అలాగే ఈ నోట్లకు ఇరువైపులా ఉండే నెంబర్ ప్యానళ్లపై అంకెల పరిమాణం ఎడమ వైపు నుంచి కుడివైపునకు ఆరోహణ క్రమంలో పెరిగి ఉంటుందని, మొదటి మూడు ఆల్ఫా-న్యూమరిక్ క్యారెక్టర్లు (ప్రిఫిక్స్) మాత్రం ఒకే పరిమాణంలో ఉంటాయని ఆర్‌బిఐ వివరించింది. ఈ కొత్త నోట్లతో పాటు గతంలో విడుదల చేసిన పాత 10 రూపాయల నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని రిజర్వు బ్యాంకు తమ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.