బిజినెస్

ఫాస్టాగ్ సర్వీసులను ప్రారంభించిన కెవిబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: తమ వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలు మరింత సౌకర్యవంతం చేసేందుకు గాను కరూర్ వైశ్యా బ్యాంక్ దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా ఫాస్టాగ్ సర్వీసులను ప్రారంభించింది. ఫాస్టాగ్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్, భారత్ బిల్ పేమెంట్ సిస్టం పేరిట మూడు కొత్త సాంకేతిక సేవలను ప్రారంభించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ రహదారుల సంస్థకు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఫాస్టాగ్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. దీనిద్వారా ముదుంగా లోడ్ చేసిన ట్యాగ్‌లను వాహనాలకు అమరుస్తారని, టోల్‌ప్లాజాల వద్ద క్యూలో నిలబడనవసరం లేకుండా, సుంకం చెల్లించేందుకు నగదు అవసరం లేకుండా ఈ ట్యాగ్ ఉపయోగడుతుందని తెలిపింది. టోల్‌ప్లాజా వద్ద ఉన్న సెన్సార్ల ఆధారంగా ట్యాగ్‌లో ఉన్న నగదు నిల్వ నుంచి ఆటోమేటిక్‌గా ఆ చార్జి ఎంతైతే అంత డెబిట్ అవుతుందని, ఈ ట్యాగ్‌లు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టోల్‌ప్లాజాల్లో చెల్లుబాటు అవుతాయని తెలిపింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ అనేది ఒక మొబైల్ యాప్ అని, దీని ఆధారంగా ఏ క్షణంలోనైనా ఇంటర్ బ్యాంక్ నగదు బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. ఇక భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బిబిపిఎస్) ఎన్‌పిసిఐ ద్వారా అందిస్తున్న ఒక సౌకర్యమని తెలిపారు. దీని ద్వారా విద్యుత్, నీరు, గ్యాస్, డిటిహెచ్, టెలికాం సేవల్లాంటి వినియోగ సంబంధమైన బిల్లుల్ని అనేక సైట్లలోకి వెళ్లడానికి బదులుగా వినియోగదారులు ఒకే ఒక యుటిలిటీ ద్వారా చెల్లించవచ్చని తెలిపింది. వినియోగదారులకు ఈ మూడు సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని బ్యాంక్ వర్గాలు తెలిపాయి.