బిజినెస్

పెట్రో కెమికల్స్ ప్రాజెక్టును విరమించుకున్న ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నుంచి కాకినాడ మధ్య ప్రతిష్టాకరమైన పెట్రోకెమికల్స్ ప్రాజెక్టును నెలకొల్పాలన్న ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం విరమించుకుంది. పదేళ్లుగా ఈ ప్రాంతంలో పెట్రోలియం కెమికల్స్ పెట్రో కెమికల్ ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్‌ను నెలకొల్పుతామని గత ప్రభుత్వాలు గొప్పగా చెప్పాయి. కాని ఇది ముగిసిన అధ్యాయమని, ఈ ప్రాజెక్టుకు నీళ్లు వదులుకున్నామని ఉన్నతాధికార వర్గాలు పేర్కొన్నాయి. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు 603.58 చ.కిమీ పరిధిలో పెట్రో కెమికల్స్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి రూ.3.43 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం గతంలో ప్రణాళికను ఖరారు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. ఈ ప్రాజెక్టు వస్తే 12 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సార్లు ఎంఒయూ ఖరారు చేసింది. పర్యావరణ శాఖ అధ్యయనం కూడా జరగలేదు. 2007 మే నెలలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు పేరుతో ప్రత్యేక అభివృద్ధి అథారిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు వౌలిక సదుపాయాలనిమిత్తం రూ.19,031 కోట్లను ఖర్చు పెట్టాల్సి ఉంది. విద్యుత్, నీటి కోసం కేంద్రం, రాష్ట్రం రూ. 6334 కోట్లను ఖర్చుపెట్టాలని ప్రతిపాదించారు. ఇంతవరకు చట్టబద్ధమైన పర్యావరణ పరమైన బహిరంగ విచారణ కూడా జరగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్టు కోసం చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, అందుకే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించిందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి.