బిజినెస్

మార్కెట్లకు స్వల్ప లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 9: కీలక రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్ సహా ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు గురవుతూ చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. నోట్ల రద్దుతో పాటుగా ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాలకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో మార్కెట్ల తీరుతెన్నులను నిర్ణయించనున్నాయి. ఈ నేపథ్యంలో వరసగా మూడు రోజులు డీలా పడిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా నష్టాలతోనే మొదలైనాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో స్వల్ప లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 27.19 పాయింట్లు లాభపడి 28,929.13 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 2.70 పాయింట్లు లాభపడి 8,927 పాయింట్ల వద్ద ముగిసింది. మారుతి సుజుకి, ఎస్‌బిఐ, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, సన్‌ఫార్మా తదితర షేర్లు లాభపడగా, డాక్టర్ రెడ్డీస్ షేరు 5 శాతానికి పైగా నష్టపోయింది. ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించగా, ఐరోపా మార్కెట్లు ప్రారంభంలోనే నష్టాల్లో కొనసాగాయి.