క్రీడాభూమి

7 నిమిషాల్లో 3 గోల్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, మార్చి 9: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రీ క్వార్టర్స్‌లో పారిస్ సెయింట్ జెర్మెయిన్ (పిఎస్‌జి)ని 6-1 తేడాతో చిత్తుచేసింది. చివరి ఏడు నిమిషాల్లో మూడు గోల్స్ సాధించి, ఎదురుదాడికి కొత్త అర్ధాన్నిచ్చింది. ఈ టోర్నమెంట్‌లో పిఎస్‌జితో జరిగిన గ్రూప్ మ్యాచ్‌ల్లో బార్సిలోనా ఒక్క గోల్ కూడా చేయలేదు. మరోవైపు పిఎస్‌జి నాలుగు గోల్స్ చేసింది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఈ విధంగా 0-4 తేడాతో వెనుకబడిన ఒక జట్టు ఎదురుదాడిచేసి, భారీ తేడాతో విజయాన్ని నమోదు చేయడం ద్వారా ప్రత్యర్థిని అధిగమించడం ఇదే మొదటిసారి. కాగా, కీలకమైన ఈ మ్యాచ్‌లో పిఎస్‌జిపై ఆధిపత్యాన్ని కనబరచిన బార్సిలోనాకు మూడో నిమిషంలోనే లూయిస్ సౌరెజ్ గోల్‌ను అందించాడు. ఆతర్వాత పిఎస్‌జి కొంత సేపు ముమ్మర దాడులతో బార్సిలోనాను బెంబేలెత్తించింది. కానీ, 40వ నిమిషంలో పిఎస్‌జి ఆటగాడు లేవిన్ కర్జావా ఓన్ గోల్ చేసి, బార్సిలోనా ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. 50వ నిమిషంలో లియోనెల్ మెస్సీ గోల్ చేయగా, 80వ నిమిషంలో మరో సూపర్ స్టార్ నేమార్ గోల్ సాధించాడు. ఎక్‌స్ట్రాటైమ్ మొదటి నిమిషంలో అతను మరో గోల్ చేయగా, ఐదో నిమిషంలో రాబర్టో సెర్గీ ద్వారా బార్సిలోనాకు ఆరో గోల్ లభించింది. పిఎస్‌జి తరఫున ఎడిసన్ కవానీ గోల్ చేయగలిగాడు.
రియల్ మాడ్రిడ్ ముందంజ
నెప్లేస్: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో రియల్ మాడ్రిడ్ వరుసగా ఏడోసారి క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ప్రీ క్వార్టర్స్‌లో ఈ జట్టు నపోలీని 3-1 తేడాతో ఓడించింది. మ్యాచ్ 24వ నిమిషంలో నపోలీకి గోల్‌ను అందించిన మెర్టెన్స్ ఒక రకంగా తన జట్టు పరాజయానికి కూడా కారణమయ్యాడు. రామోస్ 51వ నిమిషంలో ఈక్వెలైజర్‌ను సాధించగా, మెర్టెన్స్ 57వ నిమిషంలో పొరపాటున బంతిని గోల్ పోస్టులోకి కొట్టాడు. అతని ఓన్ గోల్‌తో రియల్ మాడ్రిడ్ ఆధిక్యం 2-1కి పెరిగింది. 90వ నిమిషంలో మొరాటా గోల్ చేసి, ఈ ఆధిక్యాన్ని 3-1కి చేర్చాడు. ఇదే తేడాతో రియల్ మాడ్రిడ్ మ్యాచ్‌ని ముగించింది.