బిజినెస్

గిగా వరల్డ్ బ్రాడ్‌బాండ్ ప్రచారకర్తగా సైయెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: ఇంజినీరింగ్, మ్యానుఫాక్చరింగ్, డేటా అనలిటిక్స్, నెట్‌వర్క్, ఆపరేషన్స్ సొల్యూషన్స్ సంస్థ సైయెంట్‌ను తమ నూతన సేవలైన గిగావరల్డ్ బ్రాడ్‌బ్రాండ్ ప్రచార నిమిత్తం ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ కేబుల్ టివి, బ్రాడ్‌బాండ్ సంస్థ అయన లిబర్టీ గ్లోబల్ ఎంపిక చేసింది. ఐరోపాలో గిగా బ్రాడ్‌బాండ్ సేవల వేగం పెంచేందుకు సైయెంట్‌ను ఎంపిక చేసినట్లు సైయెంట్ సంస్థ ఎండి, సిఇఒ కృష్ణ బొడనపు తెలిపారు. ఐరోపాలో 50 మిలియన్ల ఇండ్లకు లిబర్టీ గ్లోబల్ బ్రాడ్‌బాండ్ సేవలను అందిస్తోంది. నెట్‌వర్క్ మేనేజిమెంట్, ఆపరేషన్లలో తమ కంపెనీకి ఉన్న అనుభవం దృష్ట్యా ఈ ఎంపిక చేశారన్నారు.