బిజినెస్

18న జాతీయ పన్నుల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పారిశ్రామిక, ఆర్థిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య, ఎపి-తెలంగాణ ట్యాక్స్ అసోసియేషన్, అబిడ్స్, హిమయత్‌నగర్ సిపిఎస్ స్టడి సర్కిల్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన జాతీయ ట్యాక్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని ఎఫ్‌టాప్సీ సహ సంచాలకులు ఎన్‌విఎస్ లక్ష్మి తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం అధ్యక్షతన జరుగుతున్న ఈ జాతీయ సదస్సులో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాన్ యోజన, ఆధునిక జిఎస్‌టి చట్టం ప్రభావం, పన్నులు అంశాలపై చర్చిస్తారు. ప్రముఖ న్యాయవాది కెఎస్ నవీన్ కుమార్, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ డాక్టర్ అహూజాలు మాట్లాడనున్నారని ఆమె తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన దలిచినవారు 8008804529 మొబైల్ ఫోన్ నెంబర్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.