బిజినెస్

పన్ను చెల్లించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ.. 10,247 కోట్ల రూపాయల క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను చెల్లించాల్సిందేనని ట్యాక్స్ ట్రిబ్యునల్ ఐటిఎటి స్పష్టం చేసింది. గురువారం విడుదలైన ఓ ఆదేశంలో ఈ మేరకు ఐటిఎటి తెలిపింది. 2014 జనవరిలో ఈ ట్యాక్స్‌కు వ్యతిరేకంగా కెయిర్న్ ఎనర్జీ ఐటిఎటిని ఆశ్రయించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కూ వెళ్లగా, అక్కడ ఇంకా ఈ వ్యవహారం పెండింగ్‌లోనే ఉంది. ఈ క్రమంలో ఐటిఎటి కెయిర్న్ ఎనర్జీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. 2006లో తమ భారతీయ వ్యాపార అంతర్గత పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా జరిపిన లావాదేవీల్లో వచ్చిన లాభాలపై ఈ పన్ను చెల్లింపులను కెయిర్న్ ఎనర్జీ ఎదుర్కొంటోంది.