బిజినెస్

కస్టమ్ మిల్లింగ్ రైస్ 99 శాతం అప్పగింత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: రబీ సీజన్ ప్రారంభానికి ముందే ఖరీఫ్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) అదే సీజన్‌లో 99 శాతం అప్పగించడం ఇదే తొలిసారి అని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఒకే సీజన్‌లో గడువు పొడిగించకుండా ఈ స్థాయిలో సిఎంఆర్ అప్పగించడం పౌరసరఫరాల శాఖ చరిత్రలోనే ఒక రికార్డు అని చెప్పారు. తీసుకున్న వరి ధాన్యానికి తగ్గ బియ్యం ఇవ్వడానికి గతంలో మిల్లర్లు నానా కొర్రీలు పెట్టేవారని, కొంత మంది మిల్లర్లు సొంత వ్యాపారానికి వాడుకునేవారని, మరి కొందరు రీ సైక్లింగ్ చేసి బియ్యాన్ని అప్పగించేవారని ఆనంద్ తెలిపారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, గతానికి భిన్నంగా.. ఇచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్టు మరాడించి వెంట వెంటనే ప్రభుత్వానికి అప్పగిస్తున్నారని శుక్రవారం చెప్పారు. దీని వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదా అవుతోందని తెలిపారు. సిఎంఆర్‌ను సకాలంలో మిల్లర్లు అప్పగించకపోవడం వల్ల పౌర సరఫరాల సంస్థ బ్యాంకుల్లో 11 శాతం వడ్డీకి అప్పు తీసుకొని ఇదే మిల్లర్ల నుంచి 25 రూపాయలకు కిలో బియ్యం కొనుగోలు చేసి రూపాయికే పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం ముగింపు పలికిందని సివి ఆనంద్ తెలిపారు. రెండు టన్నుల సామర్థ్యం ఉన్న మిల్లులకు 1,000 టన్నుల ధాన్యం, ఆరు టన్నుల సామర్థ్యం కలిగిన వాటికి 4 వేల టన్నుల ధాన్యం కేటాయించినట్టు వివరించారు. విద్యుత్ వినియోగం కూడా పరిగణలోకి తీసుకున్నట్టు చెప్పారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పగడ్బందీగా వీటిని అమలు చేయడం వల్ల ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చేసినట్టు చెప్పారు. కాగా, ఫిబ్రవరి 15 నాటికి సిఎంఆర్ అప్పగించాలని గడువు విధించినట్టు, ఆ తరువాత సిఎంఆర్ అప్పగించిన వారి మిల్లింగ్ చార్జీల్లో కోత విధించాలని నిర్ణయించినట్టు ఆనంద్ తెలిపారు.