బిజినెస్

రూ. 29 వేల దిగువకు బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: బంగారం ధరలు శుక్రవారం పడిపోయాయి. బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర 400 రూపాయలు క్షీణించి 29 వేల దిగువకు చేరి 28,850 రూపాయల వద్ద స్థిరపడింది. 99.5 స్వచ్ఛత కలిగిన దాని ధర 28,700 రూపాయలు పలకగా, కిలో వెండి ధర కూడా 525 రూపాయలు తగ్గి 41 వేల స్థాయిని కోల్పోయి 40,975 రూపాయల వద్ద నిలిచింది. ఆభరణాల వర్తకులు, నాణేల తయారీదారులు, పారిశ్రామిక రంగాల నుంచి ఆదరణ తగ్గడం వల్లే ధరల క్షీణత అని బులియన్ వర్గాలు ట్రేడింగ్ సరళిని విశే్లషిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి, వెండి ధరలు పతనమయ్యాయి.