బిజినెస్

బ్యాంకుల్లో సొమ్ముల్లేవ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 12: వ్యాపారస్తుడు, ఉద్యోగి, సామాన్య పౌరుడు ఎవరికైనా డబ్బు అవసరమైతే బ్యాంకుకు వెళ్తాడు. తమ, తమ ఖాతాల్లో దాచుకున్న సొమ్మును ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవాలనుకుంటాడు. అయితే, బ్యాంకుల్లోనే సొమ్ము లేకపోతే వీరంతా ఎక్కడకు వెళ్లాలి? ఎవరితో చెప్పుకోవాలి? గత వారం రోజులుగా బ్యాంకుల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలు పరిశీలిస్తే.. నిజంగానే బ్యాంకుల్లో సొమ్ముల్లేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. విశాఖ జిల్లా విషయానికే వస్తే, ప్రభుత్వ, సహకార రంగాలతోపాటు ప్రైవేటు రంగంలో వెయ్యికిపైగా వివిధ బ్యాంకుల శాఖలున్నాయి. వీటిలో సగానికిపైగా బ్యాంకు శాఖలు నగదు కొరతను ఎదుర్కొంటున్నట్టు బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు పేర్కొంటున్నాయి. పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం ఉన్నదంతా బ్యాంకుల్లో జమచేసిన జనాలు.. ఇప్పుడు తీసివేత దారిపడుతున్నారు. ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి బ్యాంకు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై ఆంక్షలు ఒకటొకటిగా ఉపసంహరించడమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తానికి సరిపడా సొమ్ము రిజర్వ్ బ్యాంకు ముద్రించలేదు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో ఆర్‌బిఐ కూడా డిపాజిట్ అయిన మొత్తాన్ని తిరిగి బ్యాంకులకు చెల్లించలేదు. తాజాగా ఆర్‌బిఐ ఖాతాల్లో నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను తొలగించడం ఇప్పుడు బ్యాంకులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోంది. బ్యాంకుల్లో కరెంటు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై ఆంక్షలు ఎత్తివేశారు. దీంతో వ్యాపార, వాణిజ్య వర్గాలు ఒక్కసారిగా తమ, తమ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకుంటున్నాయ. కరెంటు ఖాతాల్లో మొత్తానికి ఎలాగూ వడ్డీ ఆశించేపని లేనందున నగదు రూపంలోనే భద్రపరచుకోవాలన్న నిర్ణయం ఇప్పుడు బ్యాంకుల్లో నగదు లేమికి కారణం అవుతోంది. దీనికితోడు వచ్చే ఏప్రిల్ నుంచి కరెంటు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ స్వల్ప మొత్తానికి పరిమితం చేయాలన్న నిర్ణయం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు, వాణిజ్య వేత్తలు పూర్తిగా పారదర్శకతతో లావాదేవీలు నిర్వహించరన్నది జగమెరిగిన సత్యం. దీంతో తమ వద్ద నగదు ఉంచుకోవడమే శ్రేయస్కరమన్న భావన వ్యాపార వర్గాల్లో చోటుచేసుకుంది. ఈ కారణంగానే బ్యాంకుల్లోని కరెంటు ఖతాల నుంచి పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణ జరుగుతోందని బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఆంక్షలు ఎత్తివేయడంతోపాటు బ్యాంకు లావాదేవీలకు సైతం పరిమితులు విధించడం కూడా ఖాతాదారుల్లో అనవసర భయాందోళనలు చోటుచేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. భారీ మొత్తంలో నగదు ఉపసంహరణ కారణంగా బ్యాంకులు సైతం నగదు కొరతను ఎదుర్కొంటున్నాయని ఎపి, తెలంగాణ బ్యాంకు ఎంప్లారుూస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పిఎస్ మల్లేశ్వరరావు తెలిపారు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ ప్రజల్లో నెలకొన్న అభద్రతా భావం తొలగించాల్సి ఉందన్నారు. మొత్తానికి పాత పెద్ద నోట్ల రద్దు తొలినాళ్లలో తలెత్తిన దుస్థితే ప్రస్తుతం కూడా కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదేమో. చాలాచోట్ల బ్యాంక్ ఎటిఎమ్‌లు ‘నో క్యాష్’ బోర్డులతో దర్శనమిస్తున్నాయ మరి.