బిజినెస్

పరిశ్రమలకు రూ. 985.15 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రెండున్నరేళ్లలో 2.20 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా 58,341 కోట్ల రూపాయల పెట్టుబడులతో 3,451 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 1,097 పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించి 43,075 మందికి ఉపాధి కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది. బోయింగ్, టాటా సికోర్సికి, హెచ్‌ఎస్‌ఐఎల్ తోషిబా, మైక్రోమాక్స్ వంటి సంస్ధలు ఉన్నాయి. పరిశ్రమల శాఖకు బడ్జెట్‌లో 985.15 కోట్ల రూపాయలు కేటాయించారు. సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్ అనే నినాదంతో రూపొందించిన టిఎస్ ఐపాస్ చట్టం వల్ల 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది.
దేశంలోని ఐటి రంగంలో 12 శాతం వాటా కలిగి, రెండవ స్ధానంలో ఉన్నామని, ఐటి ఎగుమతుల విలువ 75,070 కోట్ల రూపాయలకు చేరుకుందని తెలిపింది. ఐటి కంపెనీల ద్వారా నాలుగు లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయన్న ప్రభుత్వం.. ఐటి శాఖకు బడ్జెట్‌లో 252.89 కోట్ల రూపాయలను కేటాయించింది. సులభతర వాణిజ్య విధానంలో నెంబర్ వన్ ర్యాంకును తెలంగాణ రాష్ట్రం చేజిక్కించుకున్నది తెలిసిందే. కాగా, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హోంశాఖకు బడ్జెట్‌లో 4828.18 కోట్ల రూపాయలను కేటాయించారు. ఆధునిక వాహనాల కొనుగోలుకు, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ విజయవంతంగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలావుంటే రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిషాఠత్మకంగా చేపట్టిన తెలంగాణ హఠిత హారం పథకం కింద 230 కోట్ల మొక్కలు నాటే ప్రణాళికను ప్రారంభించింది. ఇందులో 47.53 కోట్ల మొక్కలను నాటారు. వచ్చే ఏడాది 40 కోట్ల మొక్కలను నాటుతామని, బడ్జెట్‌లో 50 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.