బిజినెస్

జెనీవా ఆటో షోలో జన సందోహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న 87వ అంతర్జాతీయ మోటార్ షో.. సందర్శకులతో కిక్కిరిసిపోతోంది.
ప్రపంచంలోని ప్రముఖ ఆటో రంగ సంస్థలన్నీ త్వరలో మార్కెట్‌లోకి తీసుకొచ్చే తమ కొత్త మోడల్ వాహనాలను ఈ షోలో ప్రదర్శిస్తుండగా, వాహన ప్రియులను అవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయ. ఈ నెల 9న మొదలైన ఈ షో.. 19 వరకు కొనసాగుతుంది. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు,
శని, ఆదివారాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకుల కోసం షో నిర్వహిస్తున్నారు.
రోల్స్ రాయస్, ఫెరారి, బెంట్లీ, బిఎమ్‌డబ్ల్యు, మెర్సిడెస్ బెంజ్, ఆడీ, వోల్వో, మజ్దా, ఫోక్స్‌వాగన్ తదితర లగ్జరీ బ్రాండ్ల వాహనాలతోపాటు జనరల్ మోటార్స్, టొయోట, హ్యుందాయ్, హోండా, ఫియట్, టాటా మోటార్స్ వంటి మధ్య శ్రేణి బ్రాండ్ల మోడల్స్ ఆహుతులను కట్టిపడేస్తున్నాయ.
మరో నాలుగు రోజులపాటు జరిగే ఈ అంతర్జాతీయ మోటార్ షోలో పాల్గొనేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు.
అత్యాధునిక హంగులతో ముచ్చటగొలుపుతున్న వాహనాలతో ఫొటోలు దిగేందుకు అంతా పోటీపడుతున్నారు.
మరికొందరు మార్కెట్ రిలీజ్ తేదీలను నమోదు చేసుకుని కొనేందుకూ సిద్ధమవుతున్నారు