బిజినెస్

‘వార్’ వన్‌సైడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: దేశీయ టెలికామ్ మార్కెట్‌లో ఆపరేటర్ల మధ్య సాగుతున్న ‘యుద్ధం’ ఏకపక్షంగానే కొనసాగనుంది. రిలయన్స్ జియో తమ వినియోగదారులకు కొనసాగిస్తున్న ఉచిత ప్రమోషనల్ ఆఫర్‌పై టెలికామ్ ట్రిబ్యునల్ స్టే విధించకపోవడమే ఇందుకు కారణం. అయితే ఈ ఉచిత పథకాలను కొనసాగించేలా రిలయన్స్ జియోకి అనుమతి మంజూరుకు సంబంధించిన అంశాలను పునఃపరిశీలించి ఆ వివరాలను రెండు వారాల్లోగా తమకు తెలియజేయాలని టెలికామ్ వివాదాల పరిష్కార అప్పిలెట్ ట్రిబ్యునల్ (టిడిఎస్‌ఎటి) గురువారం మార్కెట్ నియంత్రణా సంస్థ ట్రాయ్ (టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా)ని ఆదేశించింది. రిలయన్స్ జియో కొనసాగిస్తున్న ఉచిత ఆఫర్‌ను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గత వారం ట్రాయ్‌తో పాటు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ వాదనలను, అలాగే కొత్తగా మార్కెట్లో ప్రవేశించిన రిలయన్స్ జియో వాదనను విన్న టిడిఎస్‌ఎటి తన తీర్పును రిజర్వు చేసిన విషయం విదితమే. రిలయన్స్ జియో తన ఉచిత సేవలను కొనసాగించేందుకు ట్రాయ్ ఇచ్చిన అనుమతిని తాత్కాలికంగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ ఎయిర్‌టెల్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే ఉచిత సేవలను కొనసాగించేలా రిలయన్స్ జియోకి అనుమతి మంజూరు చేయడానికి సంబంధించిన రికార్డులన్నింటినీ సమర్పించేలా ట్రాయ్‌ని ఆదేశించాలని ఎయిర్‌టెల్ ఆ పిటిషన్‌లో కోరింది. రిలయన్స్ జియో గత ఏడాది సెప్టెంబర్‌లో తమ ఖాతాదారులకు ప్రారంభించిన ఉచిత వాయిస్, డేటా పథకాన్ని ఆ తర్వాత డిసెంబర్‌లో ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకూ పొడిగించిన విషయం విదితమే. దీంతో నిర్దేశిత 90 రోజుల గడువు ముగిసిన తర్వాత కూడా రిలయన్స్ జియో తన ఉచిత సేవలను కొనసాగించేందుకు ట్రాయ్ అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ తదితర ఆపరేటర్లు టెలికామ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. మార్కెట్ నిబంధలను రిలయన్స్ జియో యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే ట్రాయ్ వౌనం వహించి ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ఇతర ఆపరేటర్లు విమర్శిస్తున్నాయి. అయితే రిలయన్స్ జియో ఉచిత వాయిస్ కాలింగ్, డేటా పథకాన్ని కొనసాగించడం మార్కెట్ నియమ నిబంధనలను అతిక్రమించడం కాదని జనవరి 31వ తేదీన ట్రాయ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా రిలయన్స్ జియో గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించిన ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’కు అంతకుముందు ప్రవేశపెట్టిన ‘జియో వెల్‌కమ్ ఆఫర్’తో సంబంధం లేదని, ఈ రెండు పథకాలకు తేడా ఉందని, వీటి ద్వారా వినియోగదారులకు ఒనగూడే ప్రయోజనాలు వేర్వేరని తమ పరిశీలనలో తేలిందని, కనుక ప్రమోషనల్ ఆఫర్‌లో వినియోగదారులకు కల్పించిన ప్రయోజనాలను రిలయన్స్ జియో కొనసాగిస్తున్నట్లుగా పరిగణించరాదని ట్రాయ్ పేర్కొంది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి తమ సేవలకు చార్జీలు వసూలు చేస్తామని రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతమున్న తమ చందాదారులతో పాటు ఈ నెల 31వ తేదీలోగా తమ నెట్‌వర్క్‌లో చేరే కొత్త ఖాతాదారులు వన్‌టైమ్ ఫీజు కింద 99 రూపాయలు, ఆ తర్వాత నుంచి నెలకు 303 రూపాయల చొప్పున చెల్లించడం ద్వారా ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ పథకం ప్రయోజనాలను మరో ఏడాది పాటు (వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు) పొందవచ్చని రిలయన్స్ జియో గత నెలలో స్పష్టం చేసింది.