బిజినెస్

థర్మాక్స్ పరిశ్రమ నిర్మాణానికి శ్రీసిటీలో భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు/తడ, మార్చి 16: పరిశ్రమలకు అవసరమైన ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ సొలూషన్స్ పరికరాలను ఉత్పత్తచేసే థర్మాక్స్ లిమిటెడ్ తన నూతన ఉత్పత్తి కేంద్రానికి గురువారం ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులోని తడ వద్ద ఉన్న శ్రీ సిటీలో సెజ్‌లో భూమిపూజ చేశారు. కంపెనీ గ్లోబెల్ హెడ్ ఆషిష్ వైష్ణవ్ భూమి పూజ చేశారు. ఇటిజడ్ ప్రాంతంలో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.150కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమలో ఎయిర్‌కండీషనర్ యూనిట్లకు అవసరమైయ్యే థిల్లర్, ఆవిరి జనరేటర్లు, బాయిలర్లు తయారు చేస్తారు. 2018 మార్చి నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నామన్నారు. సుమారు 200 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పూణేకు చెందిన థర్మాక్స్ సంస్థను 1967లో ప్రారంభించి ఇండియాతోపాటుగా చైనా, యూరప్‌లలో ఈపరిశ్రమ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించారు.

చిత్రం.. శ్రీసిటి సెజ్‌లో థర్మాక్స్ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న కంపినీ గ్లోబెల్ హెడ్ ఆశిష్ వైష్ణవ్ తదితరులు