బిజినెస్

ఎగుమతుల పెంపునకు కృషి జరగాలి : గీతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: దేశంలో ఎగుమతులకు ఊతమిచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే ఉద్ఘాటించారు. విదేశీ మార్కెట్లలో నిలదొక్కుకోవడంలో భారత సంస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అంతర్జాతీయంగా తీవ్రమైన పోటీ నెలకొనడమే ఇందుకు కారణమని ఆయన అంగీకరించారు. రసాయన, అనుబంధ ఎగుమతుల అభివృద్ధి మండలి (క్యాపెక్సిల్) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాణిజ్య శాఖ ఆర్థిక సలహాదారు, అదనపు కార్యదర్శి జెకె.దాదూ ప్రసంగిస్తూ, గత ఐదు నెలల నుంచి దేశంలో ఎగుమతులు కొంత మేరకు పుంజుకున్నప్పటికీ స్థూలంగా 2014 నుంచి ఎగుమతుల వృద్ధి చెప్పుకోదగినంత సానుకూలంగా లేకపోవడం విచారకరమని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశంలో ఎగుమతులను పెంపొందించేందుకు అనుసరించాల్సిన మార్గాలను అనే్వషించాలని క్యాపెక్సిల్ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలోని రసాయన, అనుంబంధ పరిశ్రమల నుంచి గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 5 బిలియన్ డాలర్ల విలువైన ఖనిజాలు, 9 బిలియన్ డాలర్ల విలువైన ఖనిజేతర వస్తువులు సహా మొత్తం 14 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి అయిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.