బిజినెస్

హెల్త్ ఇన్సూరెన్స్‌కు విడిగా కంపెనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: రియలన్స్ క్యాపిటల్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థనుంచి హెల్త్ ఇన్సూరెన్స్‌ను వేరు చేసి ప్రత్యేక ఆరోగ్య బీమా కంపెనీని ఏర్పాటు చేయబోతోంది. జనరల్ ఇన్సూరెన్స్‌నుంచి ఆరోగ్య బీమాను వేరు చేయాలన్న ప్రతిపాదనకు రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. అయితే బీమా రెగ్యులేటర్ అయిన ఐఆర్‌డిఏఐ ఇంకా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపాల్సి ఉంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ రిలయన్స్ క్యాపిటల్‌కు వందశాతం అనుబంధసంస్థగా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో శరవేగంగా పెరుగుతున్న రంగాల్లో ఒకటైన హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం 2020 నాటికి రూ. 50 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా. 2016 మార్చి 31 నాటి లెక్కల ప్రకారం ఆర్‌జిఐఎల్ హెల్త్ ఇన్సూరెన్స్ పోర్ట్ఫులియో మొత్తం ప్రీమియం 570 కోట్ల రూపాయల మేరకు ఉంది. ఆరోగ్య బీమా వ్యాపారాన్ని వేరు చేయడం వల్ల కంపెనీ ఈ రంగంపై మరింత ఎక్కువ దృష్టి పెట్టడానికి వీలవుతుందని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. కాగా, రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి సిఈఓగా రవి విశ్వనాథ్ పేరును ప్రతిపాదించారు.