బిజినెస్

రేపు డిసిఐకి కేంద్ర మంత్రి మాండవ్య రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 16: కేంద్ర రోడ్లు, నౌకా మంత్రిత్వశాఖ మంత్రి మదన మనుషుక్ ఎల్ మాండవ్య శనివారం విశాఖకు రానున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా (డిసిఐ) చేపడుతున్న వివిధ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఆర్‌కె బీచ్ కోతను అరికట్టేందుకు డిసిఐ పలు కార్యక్రమాలు చేపడుతోంది. వీటిని మంత్రి మాండవ్య పరిశీలించనున్నారు. అలాగే డిసిఐ వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న కార్యకలాపాలను కూడా మంత్రి మనుషుక్ డిసిఐ కార్యాలయాలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకోనున్నారు.
కాగా, డిసిఐ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న సమయంలో మంత్రి మనుషుక్ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. డిసిఐని ప్రైవేటీకరించకూడదంటూ డిసిఐ ఉద్యోగులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం డిసిఐ కార్యాలయానికి వస్తున్న మంత్రిని ఉద్యోగులు కలుసుకోనున్నారు. డిసిఐని ప్రైవేటీకరించడం వలన వచ్చే నష్టాలను వారు వివరించనున్నారు. అలాగే సోమవారం ఢిల్లీలోని నౌకా మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులను కూడా ఈ ఉద్యోగులు కలుసుకోవాలని భావిస్తున్నారు.