బిజినెస్

మెరిసిన పసిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరలు గురువారం మార్కెట్లో పరుగులు తీశాయి. బంగారం పది గ్రాములు రూ. 450 పెరిగి తిరిగి 29 వేల రూపాయల స్థాయికి చేరుకోగా, వెండి కిలోకు ఏకంగా 1050 రూపాయలు పెరిగి రూ. 41,350కు చేరుకుంది. నగల తయారీ దారులు, పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారులనుంచి భారీ డిమాండ్ కారణంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం ధర పది గ్రాములకు రూ. 450 పెరిగి రూ. 29,100కు చేరుకుంది. వెండి ధర కూడా అదే బాటలో భారీగా పెరిగింది. కిలోకు రూ.1050 మేర పెరిగి రూ.41,350కి చేరుకుంది. అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి.