బిజినెస్

మార్కెట్లకు ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: భారతీయ మార్కెట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ గత రాత్రి జరిపిన పావుశాతం వడ్డీరేటు పెంపును తట్టుకునే స్థితిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపును తట్టుకునే స్థితిలో భారతీయ మార్కెట్లు ఉన్నాయి. భవిష్యత్తులో పెంపునకు సంబంధించి ఆచితూచి వ్యవహరిస్తామని ఫెడరల్ రిజర్వ్ పేర్కొనడం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు మంచిదే’నని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే. సెనె్సక్స్ రెండేళ్ల గరిష్ఠస్థాయికి చేరుకోగా, నిఫ్టీ సైతం సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. డాలరుతో రూపాయి సైతం ట్రేడింగ్‌ప్రారంభంలో 47 పైసలు బలపడి 16 నెలల గరిష్ఠస్థాయకి చేరుకుంది.
కాగా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంచుతుందనే విషయం ముందు ఊహించిందేనని, మన దేశంపై దీని ప్రభావం పెద్దగా ఉండదని ప్రధానికి ఆర్థిక వ్యవహారాల ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. అంతేకాదు స్నేహపూర్వక పెంపుగా దీన్ని అభివర్ణిస్తున్నారని, అందుకే డాలరు విలువ కొద్దిగా పడిపోయిందని, అమెరికా బాండ్లు సైతం కొద్దిగా తగ్గాయని ఆయన అన్నారు. భారతీయ మార్కెట్లలో పెద్దగా ఆటుపోట్లు ఉండకపోవచ్చని, రూపాయి బలపడేందుకు వీలుగా ఒత్తిడి కూడా ఉండవచ్చని, కొంతమేరకు అది కొనసాగే అవకాశం కూడా ఉంటుందనిని తాను భావిస్తున్నట్లు కూడా ఆయన అన్నారు. ఇప్పటికే అమెరికా ఫెడరల్ రిజర్వ్ జరిపిన మూడు వడ్డీ రేట్ల పెంపులను కూడా దేశీయ మార్కెట్లు జీర్ణిచుకోగలిగాయని, భవిష్యత్తులో జరపబోయే పెంపులను కూడా తట్టుకునే స్థితిలో అవి ఉన్నాయని అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ఇక ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుందనే దానిపై అంతా ఆధారపడి ఉంటుందని, వృద్ధి రేటు, ఆర్థిక స్థిరత్వం ఇలాగే కొనసాగే పక్షంలో భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ పెంచబోయే వడ్డీ రేట్లను సైతం పెద్ద కష్టం లేకుండా తట్టుకోగలుగుతామని కూడా ఆయన అన్నారు.